Political
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం
07 Aug, 2025
40 Views
జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరీ ప్రతాప్ రెడ్డి
కొమురవెల్లి ,ఆగస్టు 07(అవనివిలేకరి)రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరీ ప్రతాప్ రెడ్డి అన్నారు.గురువారం తపాస్ పల్లి రిజర్వాయర్ లోని నీటిని పార్టీ కార్యకర్తలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని తెలిపారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సుస్థిర పాలన సాగిస్తున్నారని తెలిపారు. తపాస్ పల్లి అత్యంత ఎత్తు ప్రాంతంలో ఉందని కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రిజర్వాయర్ నిర్మించిన సంగతిని గుర్తు చేశాడు. ప్రస్తుతం సరైన వర్షాలు లేకపోయినా ఈ ప్రాంత రైతులకు రిజర్వాయర్ నీటి విడుదల చేపట్టి రైతుల పంటలు ఎండిపోకుండా భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా వృద్ధి చెందడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అందుకే అభయ హస్తం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, చేయూత, వివవికాసం, పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో, కెసిఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకొని, రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు విసుగు చెంది కెసిఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపారని, ఒక్క పార్లమెంట్ సీటు గెలవకుండా బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. నేను ఈ ప్రాంత రైతుల కోసం సాధించిన రిజర్వాయర్ నీటిని కెసిఆర్, హరీష్ రావులు ఓర్వక ఇక్కడి రైతులకు అన్యాయం చేసి నీటిని వాళ్ల నియోజకవర్గాలకు తరలించిన వాళ్లను ఎదిరించి పోరాడిన సంగతి గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజల కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో పదేళ్లపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట, నర్మెట, బచ్చన్నపేట, మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.