ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు...
- శ్రీకృష్ణుడి, గోపికల వేషధారణలో అలరించిన చిన్నారులు.
కొండపాక ఆగస్టు 14 (అవని విలేఖరి)మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో ఉన్న శాంభవి మోడల్ స్కూల్ పాఠశాలలో గురువారం ముందస్తుగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు గోపిక, శ్రీకృష్ణ వేషధారణలతో ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు పాల ఉట్టిని కొట్టి వేడుకలు జరుపుకున్నారు. కృష్ణుడి వేషధారణలో చిన్నారి కృష్ణులు ఉట్టికొట్టే తీరు అందర్నీ అలరించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మిద్దె రమేష్ మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పాఠశాలల్లో నిర్వహిస్తామని అన్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక అవకాశం అన్నారు. విద్యార్థులు కృష్ణుడి జీవితం నుండి విలువైన పాఠాలను నేర్చుకుంటారు, పండుగ యొక్క ప్రాముఖ్యత విద్యార్థులు తెలుసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.