Latest News

విద్యుత్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి

18 Aug, 2025 724 Views
Main Image

విద్యుత్ షాక్ తగిలి తండ్రి కొడుకులు మృతి 


సిద్దిపేట,ఆగస్టు 18(అవనివిలేకరి) సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్ మండల పరిధిలోని చంద్రాపూర్ గ్రామంలో    సోమవారం విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తండ్రి మూర్తి గజేందర్ రెడ్డి( 60), కుమారుడు మూర్తి విజయేందర్ రెడ్డి( 27)లు గంగాపూర్ రెవెన్యూ శివారులోని తన వ్యవసాయ పొలం వద్ద సాగుచేసిన మొక్కజొన్న పంట వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా  విద్యుత్ షాక్ తగిలి తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మృతుడు గజేందర్ రెడ్డి కూతురు వివాహం నాలుగురోజుల క్రితమే జరిగింది. ఒకే ఇంటిలో తండ్రి కొడుకులు ప్రమాదవశాత్తు చనిపోవడంతో విషాదం నెలకొంది