Latest News

చికిత్స కోసం చేయూతనివ్వండి.. నా భర్త ప్రాణాలు కాపాడండి.

12 Aug, 2025 1,403 Views
Main Image



కొండపాక ఆగస్టు 12 (అవని విలేఖరి)ప్రార్థించే పెదాల కన్న సాయం చేసే చేతులు మిన్న అంటారు.. అలాంటి చేతుల కోసం చేతులెత్తి ప్రాధేయపడుతోంది ఓ కుటుంబం. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరిన ఓ నిరుపేద  కార్మికుడికి వైద్యమందించలేని పరిస్థితుల్లో దాతల సహకారం కోసం వేడుకుంటోంది.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రూ. 5 లక్షల వరకు ఖర్చు అయి  దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఇంటి ఇల్లాలు కన్నీటి పర్యంతం అవుతున్న సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో పలువురుని కంట తడి పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే. బందారం గ్రామానికి చెందిన బడేకోలు ప్రసాద్ రెక్కల మీద జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య ప్రతిభ,ఇద్దరు పిల్లలు శ్రీనాథ్, సుహర్షిత్ ఉన్నారు. కష్టం చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బడేకోలు ప్రసాద్ కు బ్రెయిన్  క్రనియోటమి ఆపరేషన్ జరిగి సిద్దిపేట ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య అతని చికిత్స కోసం రూ.5 లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలైంది. మెరుగైన అతడి చికిత్స కోసం దాతల సహకారం కోసం ఎదురుచూస్తుంది. భర్తే తన ప్రాణమై కుటుంబ సభ్యుల సహకారంతో భర్తను కాపాడుకోవాలని ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని చుట్టూ ప్రక్కల వారిని కంటతడి పెట్టిస్తుంది. మానవతా దృక్పథంతో నా భర్త బడేకోలు ప్రసాద్ వైద్యం కొరకు దాతలు ఆర్థిక సహాయం అందించాలని నా కుటుంబానికి అండగా నిలవాలని ప్రతిభ కన్నీరు మున్నీరు అవుతుంది. ఇంకా డబ్బులు పెట్టే స్థితిలో లేమని,ఎవరైనా మనసున్న మారాజులు సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని దాతలను వేడుకుంటుంది.దయచేసి ఎవరైనా దాతలు ఉంటే తమకు తోచిన సహాయాన్ని అందించి ఒక ప్రాణాన్ని,ఓ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని, సాయం చేసే మనసున్న దాతలు నేరుగా కానీ, 97058 31208 ఫోన్ పే నంబర్ కు తోచిన సహాయం అందించాలని స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు