అనారోగ్యంతో జూనియర్ వెటర్నరీ అధికారి కొండల్ రెడ్డి మృతి చెందారు. జూనియర్ వెటర్నరీ అధికారి పురమండ్ల కొండల్ రెడ్డి బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. సిద్దిపేటలో జూనియర్ వెటర్నరీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కొండల్ రెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. కాగా బుధవారం ఉదయం సిద్దిపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 32 సంవత్సరాలుగా పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. సిద్దిపేట మండలం బక్రిచెప్యాల గ్రామానికి చెందిన కొండల్ రెడ్డి తల్లి బక్రిచెప్యాల ఎంపిటిసి సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరితో కలిసిమెలిసి ఉండే కొండల్ రెడ్డి మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కొండల్ రెడ్డి అంత్యక్రియలలోనాయకులు,ప్రజాప్రతినిధులు,అధికారులు, సిబ్బంది,ప్రజలు పాల్గొని నివాళులు అర్పించారు. కాగా కొండల్ రెడ్డి మరణించారని విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లి మృత దేహానికి నివాళ్లు అర్పించి, శోక సంద్రం లో ఉన్న కుటుంబాన్ని ఓదార్చారు. వెటర్నరీ అధికారి కొండల్ రెడ్డి
మృతి బాధాకరమని, కొండల్ రెడ్డి మృతి ఎంతో కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కు ఎంతో ఆత్మీయుడు అని, అధికారిగా ఎన్నో సేవలు చేసాడని, గ్రామ అభివృద్ధి లో నిరంతరం పాటు పడేవాడిని ఆయన సేవలు కొనియాడారు, తన కుటుంబం బి ఆర్ ఎస్ పార్టీ కి ఎంతో అనుబంధం ఉందన్నారు. కొండల్ రెడ్డి మృతి చెందిన విషయం తెల్సు కొని ఆసుపత్రి కి వెల్లి మృత దేహానికి నివాళ్లు అర్పించారు,