Latest News

హరీష్ రావు పై అనుచిత వాక్యాలను సహించేది లేదు

11 Jan, 2026 22 Views
Main Image

హరీష్ రావు పై అనుచిత వాక్యాలను సహించేది లేదు 

- 100% పామాయిల్ ఫ్యాక్టరీ మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు కృషి వల్లనే సాధ్యమైంది 

- కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు రాజకీయాలు మానుకోవాలి 


నంగునూరు, జనవరి 11(అవనివిలేకరి)మాజీమంత్రి ఎమ్మెల్యే  హరీష్ రావు పై  అనుచిత వ్యాఖ్యాలను సహించలేదని మాజీ జెడ్పి వైస్ చైర్మన్ రాగుల సారయ్య మాజీ పిఎస్ఏ చైర్మన్ కోల రమేష్ గౌడ్ , నంగునూరు  సర్పంచ్ బాల పోశయ్య  అన్నారు. ఆదివారం రోజు నంగునూరు మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో విలేకరుల సమావేశంలో రాగుల సారయ్య కొల రమేష్ గౌడ్, కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు దేవులపల్లి యాదగిరి  కాంగ్రెస్ కార్యకర్తలు  చిల్లర రాజకీయాలు చేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతూ హరీష్ రావు పై  అనుచిత వ్యాఖ్యలు చేయడం  తగదని  తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. 100% పామాయిల్ ఫ్యాక్టరీ  బిఆర్ఎస్ ప్రభుత్వం నే   మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎనలేని కృషి వల్లనే సాధ్యమైందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకొని  వాస్తవాలు గ్రహించాలని , అవగాహన రహిత్య వ్యాఖ్యలు  మానుకోవాలని , హరీష్ రావు  పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శిస్తే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయమా అని అనడం సిగ్గుచేటు అని అన్నారు . గతంలో కాంగ్రెస్ మంత్రులు పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా  కాంగ్రెస్ పార్టీ కార్యాలయం  అని ఎద్దేవ చేశారు. అనంతరం  నిన్నటి రోజున  హరీష్ రావు పై అనుచిత  వ్యాఖ్యలు చేసిన  చిత్రపటానికి నిప్పటించిన   కాంగ్రెస్ నాయకుల పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల పోశయ్య  బిఆర్ఎస్ నాయకులు మహేందర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీధర్ గౌడ్ , యువజన నాయకులు తప్పట పరశురాములు  బిక్షపతి నాయక్ , దేవులపల్లి రాజేందర్ , బిఆర్ఎస్ కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.