సిద్దిపేట,ఆగస్టు 09(అవనివిలేకరి) సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా సమీపంలో గల కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ల సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శృతి అనే యువతి చనిపోయారు . నంగునూరు మండలం నర్మెట గ్రామానికి చెందిన నాగిల్ల శ్రీనివాస్ తన అక్క, మేన కోడలు శృతిని కారులో నర్మెటకు తీసుకు వెళ్తుండగా నర్సాపురం చౌరస్తా వద్ద వెనుక వైపు నుండి బస్సు కారును డీ కొట్టగా కారులో వెనుక సీటులో ప్రయాణిస్తు శృతి చనిపోయింది. నర్మేట గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నాగిళ్ల శ్రీనివాస్ , గజ్వేల్ కు చెందిన వాళ్ల అక్క లక్ష్మీ ఇరువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు .