Latest News

అరుణారెడ్డికి తెలుగు వెలుగు నంది పురస్కారం

25 Jan, 2026 13 Views
Main Image

అరుణారెడ్డికి తెలుగు వెలుగు నంది పురస్కారం


సిద్దిపేటకు చెందిన గాడిపల్లి అరుణారెడ్డి తెలుగు వెలుగు నంది జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.ఆదివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో కాలోజీ స్మారక సంస్థ,తెలుగు వెలుగు సాహితీ సంస్థల ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.ఇందులో భాగంగా అరుణారెడ్డి అందిస్తున్న సామాజిక సేవా,మహిళా చైతన్య కార్యక్రమాలను గుర్తించి ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.అవార్డు అందుకున్న ఆమెను పలువురు అభినందించారు.ఈ సందర్భంగా అరుణారెడ్డి మాట్లాడుతూ ఇది మొదటి మెట్టు విజయంగా భావించి మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తానన్నారు.నాకు పురస్కారం లభిస్తుందని ఊహించలేదని,తన సేవలను  గుర్తించి నంది పురస్కారం ఇచ్చిన కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.