Crime

బ్యాంక్ లో చోరీకి విఫలయత్నం

08 Aug, 2025 38 Views
Main Image

మెదక్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వ్యవసాయ శాఖ బ్రాంచ్ లో గురువారం రాత్రి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు కార్యాలయం భవంతి పైనుంచి లోనికి ప్రవేశించి స్ట్రాంగ్ రూమ్ గోడ రంజన్ చేయడానికి ప్రయత్నించారు. శుక్రవారం ఉదయం స్వీపర్ వచ్చి చూసేవారికి గోడ పెచ్చులు పడి ఉండటంతో  బ్యాంకు అధికారులకు తెలియజేశారు. బ్యాంక్ అధికారులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం చేరుకున్న క్లూస్ టీం బ్యాంకు లో ఉన్న క్లూస్ ను సేకరించారు. బ్యాంకులోని సీసీ కెమెరాలు ఇద్దరు దొంగలు ముసుగులు ధరించి బ్యాంకు లోపల తిరిగినట్లు రికార్డు అయినట్లు   బ్యాంక్ అధికారులు తెలిపారు. పట్టణ సీఐ మహేష్ చేరుకొని బ్యాంకు పరిసరాలను పరిశీలించారు బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.