Latest News

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ముఖ్యమంత్రి

22 Mar, 2026 33 Views
Main Image

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ముఖ్యమంత్రి 


_ నర్మెట సభ నుండి రైతు భరోసా విడుదల 


_ 50 కోట్లతో రిఫైనరీ శంకుస్థాపన 


_ పామాయిల్ తోటలు సాగు చేయండి అని రైతులకు పిలుపు 


సిద్దిపేట లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించండి మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది

-ముఖ్యమంత్రి 


నంగునూరు, మార్చి22 (అవనివిలేఖరి)నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఆదివారం రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు ఈ సభలోనే ముఖ్యమంత్రి రైతు భరోసా3600 కోట్లు విడుదల చేశారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రిఫైనరీ 50 కోట్లతో శంకుస్థాపన చేశారు. మూడు విడతల్లో 9000 కోట్లు 45 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరి భవిష్యత్తులో ప్రభుత్వం కొనే పరిస్థితిలో లేదని వాణిజ్య పంటలు వైపు రైతులు మోగ్గుచూపాలని , ఆయిల్ ఫామ్ వల్ల అధిక లాభాలు పొందవచ్చునన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ యుద్ధ ప్రతిపాదికన 16 నెలలో ఫ్యాక్టరీ పూర్తి చేసామని చెప్పారు. ఇప్పటివరకు మూడు లక్షల ఎకరాలను ఆయిల్ ఫామ్ సాగవుతుందని పది లక్షల ఎకరాలను సాగుచేసిన కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రజలకు న్యాయం చేయాలని అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. చైర్మన్ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి, సిపి రష్మీ పెరమాల్, గ్రామ సర్పంచ్ స్వాతి, ఆయిల్ ఫెడ్ అధికారులు పాల్గొన్నారు