ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మాట్లాడిన సీఎం
విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులకు సీఎం సూచన
నంగునూరు, మార్చి 22(అవనివిలేకరి)నర్మెట లోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ శాఖలకు చెందిన స్టాళ్లలో విద్యాశాఖ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ స్టాల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ స్టాల్ వద్ద నర్మెటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. నర్మెట ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల విద్యా ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. తమ పాఠశాలలోని ఉపాధ్యాయులు బాగా పనిచేస్తున్నారని, ఫలితంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎనగందుల మనీష్ కుమార్ ను ముఖ్యమంత్రి పలకరించారు. ప్రధానోపాధ్యాయుని పేరు అడిగి విద్యార్థుల సంఖ్యను ఇంకా పెంచాలని సూచించారు. పిల్లల్ని బాగా చదివించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో చెప్పి విద్యార్థులను ఆశీర్వదించారు. సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక వెంకటస్వామి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన రావు లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో గ్రూప్ ఫోటో దిగారు.