Latest News

నర్మెట్ట లో కేసీఆర్ హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం

22 Mar, 2026 89 Views
Main Image

నర్మెట్ట లో కేసీఆర్ హరీష్ రావు చిత్రపటాలకు  పాలాభిషేకం 

నంగునూరు, మార్చి 22, (అవనివిలేఖరి)నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కెసిఆర్ హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు నర్మెట్ట మాజీ సర్పంచ్ అబ్దుల్ అజిత్ మాట్లాడుతూ హరీష్ రావు కృషి వల్లనే నర్మెట్టలో ఆయిల్ ఫామ్ రూపుదిద్దుకుంది అని కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గాల్లో తేమశాతం పెరగడం వల్ల బిఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు కృషి వల్లనే సాధ్యమైందని గుర్తు చేశారు ఆ సందర్భంలో సర్పంచిగా ఉన్నానని హరీష్ రావు చేసిన కృషి దగ్గరుండి చూసాను అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పుప్పాల నారాయణ, నర్మెట్ట ఉపసర్పంచ్ విక్రమ్ మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, టిఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.