కుషాయిగూడ లో కండ్లకు గంతలు కట్టి మట్టి వినాయక విగ్రహాన్ని తయారుచేసిన శిల్పకళాకారుడు హోతి బసవరాజ్
హైదరాబాద్, ఆగస్టు 26(అవనివిలేకరి) కుషాయిగూడ లో శిల్పకళాకారుడు హోతి బసవరాజ్ కళ్ళకు గంతలు కట్టుకొని 54 నిమిషాల వ్యవధిలో మూడు ఫీట్ల వినాయక విగ్రహాన్ని తయారుచేసి గిన్నిస్ బుక్ లో స్థానాన్ని సంపాదించుకునేందుకు కష్టపడుతున్నాడు గణేష్ చతుర్థి వేడుకలు గణేష్ల పండుగ సందర్భంగా మట్టితో విగ్రహాన్ని తయారుచేసి కండ్లకు గంతలు కట్టుకొని మరోసారి గుర్తింపు పొందాడు గత రెండు సంవత్సరాలుగా గతంలో పసుపుతో విగ్రహాన్ని తయారుచేసి అంతర్జాతీయ వ్యాప్తంగా విశ్వగురు వరల్డ్ రికార్డును సంపాదించుకున్నాడు అయితే ఇప్పుడు మట్టి విగ్రహాన్ని తయారు చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు గణపతిని దర్శించుకునేందుకు భక్తులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు హైదరాబాద్ నగరంలో నగర చివర్లో కుషాయిగూడ లో గణపతి ప్రత్యేకత ఏమిటంటే కళ్ళకు గంతలు కట్టి వినాయకుని తయారు చేయడం చర్చ నియాంశంగా మారింది ఈ వినాయకుని చూసేందుకు భక్తులు కుషాయిగూడ కు వస్తున్నారు మరోసారి హోతి బసవరాజ్ పేరు మారుమోగ నుంది.