Stories

పాటను ఆయుధంగా మలిచిన పాణిగ్రాహి - నేడు విప్లవ కవి పాణిగ్రాహి జయంతి

08 Sep, 2025 115 Views
Main Image


పాటను, నాటికను ఉద్యమ ఆయుధంగా మలిచిన వాడు. అట్టడుగు పొరల్లో వున్న బోనీల వాళ్ళ జముకల కథను తన స్వంతం చేసుకుని, ఉద్యమ స్వరంగా, గళంగా మలిచిన వాడు. ఆయన చరిత్ర రక్తాక్షరాల చరిత్ర. ఆయన చరిత్ర పాటలతో ప్రభావితం చేసిన చరిత్ర. ఆయన చరిత్ర కళాకారుడిని విప్లవనేతగా మసలిన చరిత్ర. ఉద్యమానికి, సాయుధ పోరాటానికికలం, గళంతోపాటు ప్రాణాన్ని త్యాగం చేసిన ధన్య జీవి.భారత విప్లవోద్యమ చరిత్రలో, ప్రత్యేకించి శ్రీకాకుళోద్యమ పోరాటంలో త్యాగపూరిత చరిత్రలలో పెన్నూ, గన్నూ పట్టిన వారు కామ్రేడ్  పాణిగ్రాహి సుబ్బారావు గారి జన్మదిన జ్ఞాపకం !

శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో అమరులు కామ్రేడ్ పంచాది కృష్ణమూర్తి, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, చాగంటి భాస్కరరావు, పంచాది నిర్మల, పైలా వాసుదేవరావు, వసంతాడ రామలింగాచారి, తదితరులతోపాటు పేరెన్నిక గల పేరు సుబ్బారావు పాణిగ్రాహిది. కల్లోల 1960వ దశకం చివరలో ఆంధ్రప్రదేశ్లో ప్రజా విప్లవ కళాకారుడిగా చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకున్న వాడు సుబ్బారావు పాణిగ్రాహి. ఊరూ, వాడా, పల్లె, పట్నం తన కళావికాసంతో పులకించిపోయిన దశ అది. పులకించడమే కాదు వికసిస్తూ, ఉత్తేజం పొందిన రోజులవి.

.....

సుబ్బారావు పాణిగ్రాహి విప్లవ ప్రజాకవి. ఇతడు 1934, సెప్టెంబర్ 8న శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం బారువాలో ఒక పూజారి కుటుంబంలో జన్మించాడు. బొడ్డపాడు గ్రామానికి పూజారిగా వచ్చాడు. అక్కడ తామాడ గణపతి, పంచాది కృష్ణమూర్తిలతో పరిచయమై వారితో కలసి యువకులను ఉద్యమాల్లోకి తెచ్చాడు. తెగింపు సంఘాన్ని పెట్టి ఎందరో యువకులను శ్రీకాకుళ పోరాటంలోకి తీసుకొచ్చాడు. ప్రజల కష్టాలపై ఎన్నో పాటలను, గేయాలను, నాటికలను రాశాడు. ‘ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం’, ‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’ వంటి ఆయన రాసిన పాటలు శాశ్వతంగా నిలిచి పోయాయి. తామాడ చినబాబుతో కలిసి ఆయన చెప్పిన జముకుల కథ ప్రజలను ఉర్రూతలూపింది. ఆయన రాసిన ‘ఓ అరుణ పతాకమా, చేగొనుమా రెడ్ శాల్యూట్’ అనే పాట విప్లవకారులు నిత్యం జెండా వందన వేళ పాడుకునే విప్లవగీతం అయింది.

.....

సుబ్బారావు పాణిగ్రాహి నక్సల్బరీ తిరుగుబాటులో పాల్గొన్నాడు మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనిస్ట్)లో చేరాడు.. 

1969లో పార్టీ సోంపేట ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన సుబ్బారావు ఉద్దానం,పర్లాకిమిడిప్రాంత ప్రజల చైతన్యవంతం బాధ్యతలు. అతను ఇద్దరు ప్రముఖ నక్సల్ నాయకులు వెంపటాపు సత్యనారాయణ మరియు ఆదిభట్ల కైలాసంతో కలిసి

శ్రీకాకుళంమరియు ఉత్తర ఆంధ్రలో రైతు ఉద్యమాన్ని నిర్వహించారు . గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్ వార్‌ను రూపొందించడానికి పార్టీ సాంస్కృతిక భాగస్వామ్యంలో పాణిగ్రాహి కీలక పాత్ర పోషించారు . 


• నాస్తికుడిగా....


సుబ్బారావు శివభక్తుడు. శివుడిపై ఎనలేని భక్తి. పూజించేవాడు. పాటలు పాడేవాడు. శివుణ్ణి నమ్మినా కూడా ఫెయిలయ్యానని కోపం వచ్చింది. రెండవసారి కూడా ఫెయిల్ అయ్యేసరికి మరింత కోపం వచ్చింది. ఇక అప్పటి నుంచి దేవుణ్ణి నమ్మలేదు. నాస్తికుడిగా మారాడు. అది పూజారిగా వున్నా, నాయకుడిగా వున్నా చివరి దాకా నాస్తికుడిగానే వున్నాడు. ఈ నాస్తికత్వమే, కోపమే ఆరంభంలో శివుని వాహనం నంది మీద ఎక్కికూర్చునే యత్నం చేశాడు. ఉద్యమకాలంలో బొడ్డపాడులో దేవతా విగ్రహాలను ఉరితీశాడు. ఇందులో ఆగ్రహం, ఆవేశం వున్నది.


• మాటకారితనం - రాతపై మక్కువ...


సుబ్బారావుది మాట కారితనం - కలుపుగోలుగా, ఆకర్షణీయంగా మాట్లాడేవాడు. ఎవరితోనైనా చొరవగా గలగలా మాట్లాడేవాడు. అలానే 15 సం||ల వయస్సు నాటికే రాయడంపై కూడా మక్కువ ఏర్పడింది. అంటే 1949 నుంచి భజన పాటలు, కీర్తనలు, పద్యాలు, మాటలు రాసేవాడు. అమ్మ మీద ఒక పద్యం రాశాడు. భక్త కుచేల ఆయనకు ఇష్టమైన నాటకం. అమ్మవారి సంబరాల్లో ఆ నాటకాన్ని వేసేవాడు. అందులో సుబ్బారావు కుచేలుడుగా నటించేవాడు. అలానే రాగం, తాళం వాటిపై జ్ఞానం అలవడింది. రాగయుక్తంగా పాడేవాడు. అలానే ఒరియా భాషను చదవడం, రాయడం నేర్చుకున్నాడు. తెలుగు ఛందస్సు నేర్చుకున్నాడు. ఇలా సాంస్కృతిక రంగంపై మక్కువ పెరిగింది. 


• అమరత్వం ...


సుబ్బారావు పాణిగ్రాహి శ్రీకాకుళ గిరిజనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. చాగంటి భాస్కరరావు, తామాడ గణపతి మరణం తర్వాత సోంపేట ఏరియా పార్టీ కార్యదర్శిగా పాణిగ్రాహిని ఎన్నుకున్నారు. అనతి కాలంలోనే అంటే, 1969 డిసెంబర్ 22న పాణిగ్రాహిని రంగమటియ కొండల్లో కాల్చి చంపారు. ఆయన జీవించింది 35 ఏండ్లు. అమరత్వం పొంది 50 ఏండ్లు అయ్యింది. 35 ఏండ్ల జీవితంలోనే వంద ఏండ్ల జీవిత సాఫల్యత వున్నది. ప్రజాకళలకు జీవం పోసి వాటిని రాజకీయాలతో జోడించి ఉద్యమ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి.

మొత్తంగా కా| సుబ్బారావు పాణిగ్రాహి జీవితం భారత కమ్యూనిస్టు విప్లవోద్యమంలో ఒక అరుణ రేఖ. ఆయన ఒక అరుణతార, కత్తిని కలం చేసి, కలాన్ని ఉద్యమ బలాన్ని చేసి నెత్తురు చాళ్ళుపోస్తూ - సాగిన ఆ కష్టభూయిష్ట జీవితం, ఆదర్శవంతమైన కృషి అందరం శ్లాఘించాలి. విప్లవోద్యమంలో, విప్లవ సాంస్కృతికోద్యమంలో ఆయనొక దిక్సూచి. 

......

నక్సల్బరీ ఉద్యమం యొక్క ఎర్రని కిరణాలు ఐదు దశాబ్దాల క్రితం దేశంలోని దోపిడీ వర్గాల విముక్తికి కొత్త బల్లాడ్‌కు జన్మనిచ్చాయి. సుబ్బారావు ఈ కిరణాలను తన స్వంత తత్వశాస్త్రం మరియు దాని సాధన కోసం తీసుకున్నాడు. అతని కుటుంబం మొత్తం ప్రదర్శనల కోసం అతని నాటకాలతో పాలుపంచుకుంది మరియు అతని కుటుంబ సభ్యులు మరియు బంధువులు రాజకీయంగా అతనికి అండగా నిలిచారు. అటువంటి చురుకైన ప్రమేయం అతన్ని రాష్ట్రానికి ప్రకటిత శత్రువుగా మార్చింది మరియు అతని సోదరులు మరియు సోదరీమణులలో ఒకరిని పోలీసులు అతనికి అధ్వాన్నమైన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యంతో అరెస్టు చేశారు. సుబ్బారావు మరణించిన తర్వాత కూడా వారు కటకటాల వెనుకే ఉన్నారు.


సుబ్బారావు అమరవీరుడు అయిన తర్వాత, జనవరి 1970 సంచిక విముక్తి, CPI (ML) యొక్క ఆంగ్ల మౌత్‌పీస్, పార్టీ స్వయంగా విడుదల చేసిన ఒక ప్రకటనను ప్రచురించింది. ప్రకటన ఇలా ఉంది: "నవంబర్ చివరి నుండి డిసెంబర్ ప్రారంభంలో (1969/1970) పోలీసులచే పదమూడు మంది కామ్రేడ్‌లు హత్య చేయబడ్డారు, వారిలో ఒకరు సుబ్బారావు పాణిగ్రాహి. అయితే ఈ విషయం వాస్తవానికి దూరంగా ఉంది. చెప్పిన పదమూడు మందిలో ఏడుగురు సహచరులు ముందుగా వీరమరణం పొందారు.మిగిలిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఆరుగురిలో సుబ్బారావు ఒకరు.పోలీసులు వారిని లొంగిపోవాలని, పార్టీని తిరస్కరించాలని ప్రలోభపెట్టినట్లు సమాచారం.అయితే వారంతా పార్టీకి విశ్వాసపాత్రంగా ఉంటూ ఫైరింగ్ స్క్వాడ్‌ను ఎదుర్కొంటూ అమరులయ్యారు.


• పాణిగ్రాహి రాసి పాడిన ప్రసిద్ధి చెందిన పాటలు...


1) ఓ అరుణ పతాకమా, చేగొనుమా రెడ్ శాల్యూట్


2) ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం


3) కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టుల


4) వినండి బాబూ విషాధ గాథ గోదావరి నది వరదల బాధ


5) దిక్కుమొక్కు లేని జనం ఒక్కొ క్కరు అగ్నికణం.. సింహకంఠ నాదంతో వస్తారిక కాచుకోండి.


• రచనలు...నాటికలు

1) కుంకుమరేఖ

2) రిక్షావాలా

3) ఎండమావులు

4) కాలచక్రం

5) విముక్త.                                 


.