Latest News
గద్దర్ ఆశయాల అడుగుజాడల్లో నడుద్దాం.
06 Aug, 2025
58 Views
గద్దర్ ఆశయాల అడుగుజాడల్లో నడుద్దాం.
నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించుకుందాం
ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్,వైస్ చైర్మన్ ఆస లక్ష్మణ్ పిలుపు
సిద్దిపేట,ఆగస్టు 06(అవనివిలేకరి) దివంగత ప్రజాగాయకుడు గద్దర్ రెండవ వర్ధంతి సందర్బంగా బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల వై జంక్షన్ వద్ద ప్రతిపాదిత గద్దరన్న విగ్రహ నిర్మాణం స్థలంలో నేడు అనేక ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామిక శక్తులు గద్దరన్న అభిమానులు సమక్షంలో వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాజనర్సు , వైస్ చైర్మన్ జంగిటి కనుకరాజు హాజరై విగ్రహ నిర్మాణానికి మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలుఅందిస్తామని నివాళులర్పిస్తూ నిర్వహించిన సభలో భాగస్వామయ్యారు. సభనుద్దేషించి పోచబోయిన శ్రీహరి యాదవ్, ఆసలక్ష్మన్ మాట్లాడుతూ సిద్దిపేటలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ముందుకు వచ్చినటువంటి అన్ని దళిత బహుజన ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక విద్యార్థి యువజన సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సిద్దిపేటలో గద్దర్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అంటే ఐదు దశాబ్దాల తెలంగాణలోని, మొత్తం భారతదేశంలోని, ప్రజా ఉద్యమాల్ని, హక్కుల కోసం గొంతు ఎత్తిన ఆదివాసీ దళిత బహుజన ప్రజా పోరాటాలని, ప్రాంతీయ ప్రజాస్వామ్యం కోసం, స్వయం గౌరవం, మానవ హక్కుల కోసం జరిగినటువంటి అన్ని ప్రజా ఉద్యమాల్ని మననం చేసుకున్నట్టేనని, సిద్దిపేటకు గద్దర్కి ప్రత్యేక అనుబంధం ఉందని, వారు మన ఉమ్మడి మెదక్ జిల్లా వాస్తవ్యులని, మన జిల్లాఖ్యాతిని ప్రపంచ ప్రఖ్యాతిగావించి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించే అన్ని ఉద్యమాల్లో ముందున్నాడన్నారు.సిద్దిపేట మహనీయుల ఆశయాన్ని, వాళ్ళ అడుగుజాడల్లో నడవడానికి ముందుంటది, విగ్రహ ఏర్పాటు కూడా ముందుకురావడం మీ అందరి సహకారంతో ఈ సభ నిర్వహించుకోవడమే కాకుండా భవిష్యత్తులో విగ్రహ ఏర్పాటు ఆవిష్కరణ సందర్భంగా వేలాది మంది ప్రజల సమక్షంలో ఆవిష్కరించడంలో కూడా మీరంతా భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జర్నలిస్ట్ నాయకులు రంగాచారి, బోయ రాములు, టి పి టి ఎఫ్ అసోసియేట్ అధ్యక్షులు గాడి పల్లి తిరుపతిరెడ్డి . కే సత్తయ్య సార్, అవని సంపాదకులు, జర్నలిస్టు కూతురు రాజిరెడ్డి, దళిత ప్రజా సంఘాల నాయకులు గ్యాదరి రామస్వామి,పంబాల ఎల్లయ్య తుమ్మ శ్రీనివాస్, మేరుగు మహేష్, అందె ప్రవీణ్, గ్యాదరి జగన్ ముత్యాల కనుకయ్య, సందులాపురం కనుకయ్య, బెల్లే రాములు, సుకూరి ఎల్లయ్య, దేవర ఎల్లం, పోతుల మోహన్, మెరుగు బద్దిరాజు ఆస బాబు, బీసీ సంఘాల నాయకులు పయ్యావుల రాములు యాదవ్ మామిళ్ల ఐలయ్య యాదవ్ కోర ఎల్లయ్య, కురుమ,కుమ్మరి సంఘం నాయకులు శ్రీను బొల్లు రాము యాదవ్ కోరే ఎల్లయ్య కుర్మ, జిడ్డి కనకయ్య నాయకం లక్ష్మణ్, పోలీసు రాజులు, పద్మశాలి సంఘం నాయకులు డాక్టర్ సతీష్, బూర మల్లేశం, బొల్లు రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా గాయకులు భీమసేన, చీకోడు నరసింహులు, గద్దర్ పాట ద్వారా నివాళులర్పించారు.