Latest News

గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్న మాజీ ఎమ్మెల్యేలు.

06 Aug, 2025 152 Views
Main Image


హైదరాబాద్,(అవనివిలేకరి)గులాబీ పార్టీకి మరో సంక్షోభం వచ్చి పడింది. ఆ పార్టీకి చెందిన పది మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్‎కు రాజీనామా చేశారు. వీరు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆపరేషన్ ఫాంహౌస్ కేసులో చిక్కిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి కూడా పార్టీలో బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.అదే విధంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఈ నెల 9న నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో బీజేపీ కీలక నేతల బీఎల్ సంతోష్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొనేందుకు రెడీ అయిపోయారని సమాచారం. వీరిలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. రెండో దఫాలో మరో ఆరుగురు బీజేపీలో చేరుతారని సమాచారం.అయితే బీజేపీతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ ఫాంహౌస్ కేసులో పాల్గొన్న నేతలంతా బీఎల్ సంతోష్‎తో మంతనాలు సాగించినట్టు టాక్. తమంతట తాము బీఎల్ సంతోష్ పేరు చెప్పలేదని, అంతా కేసీఆర్ చెప్పినట్టుగానే చేశామని వారు బీఎల్ సంతోష్‎కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. రెండో దఫా జాయినింగ్స్‎లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు కారు దిగుతారని సమాచారం.