Latest News

ఘనపూర్ లో పులి పంజా ..ఆవును చంపిన పులి

08 Feb, 2026 284 Views
Main Image

ఘనపూర్ లో పులి పంజా 


నంగునూరు ఫిబ్రవరి 8 (అవని విలేఖరి) సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. యాదాద్రి జిల్లా నుంచి ప్రవేశించిన ఈ పులి. దూల్మిట్ట, మద్దూరు, నంగునూరు, కోహెడ మండలాల్లో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మద్దూరు మండలం లధ్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో లేగదూడలపై దాడి చేసిన పులి, ఆదివారం నంగునూరు మండలం ఘనపూర్‌లో రైతు బాలరెడ్డి పొలం వద్ద ఆవు దూడను చంపి తిన్నది. నంగునూరు మండలం లో పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఈ సందర్భంగా రాజగోపాల్పేట ఎస్సై మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాయిల వద్ద పశువులను కట్టి వేయకూడదని రైతులు బాయిల వద్దకు గుంపులుగా వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.