Latest News

మావోయిస్టు నాయకులు రాజిరెడ్డి,తిరుపతి లొంగుబాటు

22 Feb, 2026 120 Views
Main Image


హైదరాబాద్, ఫిబ్రవరి 22(అవనివిలేకరి)ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ SIB ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్, రాజిరెడ్డి టార్గెట్గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.