Political

మున్సిపల్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ను పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి...

31 Mar, 2026 12 Views
Main Image

​దుబ్బాక, మార్చి 31: ( అవని విలేఖరి) దుబ్బాక  మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఇల్లందుల శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, శ్రీనివాస్ తన పొలానికి వెళ్లిన సమయంలో కాలు జారి పడటంతో ఆయన ఎడమ చేయికి తీవ్ర గాయమై ఎముక విరిగింది.

​ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈరోజు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు, ధైర్యంగా ఉండాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరగా కోలుకోవాలని శ్రీనివాస్ గారికి వారు ఆకాంక్షించారు. ఈ పరామర్శలో వారి వెంట పలువురు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు