content
అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
- కలెక్టర్ హైమావతి చేర్యాల,ఆగస్టు 16(అవనివిలేకరి) చేర్యాల మండలం కేంద్రం నుండి కడవెరుగు గ్రామ పరిధిలో గల రోడ్డు వెంబడి ఉన్న లో- లెవెల్ వంతెన, చేర్యాల నుండి మద్దూరు మండలంలోని వల్లంపట్ల పోయే మార్గంలో గాగిలాపూర్ గ్రామ పరిధిలో గల లో- లెవెల్ వంతెనలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు వంతెన పైనుండి పోయిన యెడల ఎదుర్కోవాల్సిన చర్యలపైన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వాతావరణ శాఖ సూచించిన విధంగా అధిక వర్షపాతం నమోదయ్య అవకాశం ఉన్నందున ఎల్లప్పుడూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒక వేళ లో-లెవెల్ వంతెనపై నుండి నీరు వెళుతున్న క్రమంలో రాకపోకలు నిలిపివేయాలని, ప్రజల ప్రాణాలు అతి ముఖ్యమని తరచు పోలీస్ పికెటింగ్ సైతం చేయాలని పోలీసు అధికారులకు ఎల్లప్పుడూ మానిటర్ చేయాలని రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అలాగే వంతెన కింద మరియు కాలువల్లో చెత్తాచెదారం తొలగించాల్సిందిగా ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట తహసిల్దార్ దిలీప్ కుమార్, ఆర్ అండ్ బి ఏ ఈ తదితరులు ఉన్నారు.అనంతరం కొండపాక మండలం పాత మెదక్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తున్నప్పటికీ కూర నాణ్యత మెరుగవ్వాలని, కూరగాయలు, నాణ్యమైన ఆహారపార్థాలతో రుచికరంగా వండాలని వంట సిబ్బందికి ఆదేశించారు. వంటగది లోపల, బయటి పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.