Latest News
అన్నదాన భవనం కు గ్రానెట్ విరాళం గా ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
23 Aug, 2025
30 Views
అన్నదాన భవనం కు గ్రానెట్ విరాళం గా ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ సభ్యులు..
సిద్దిపేట,ఆగస్టు 23(అవనివిలేకరి)సిద్దిపేట పట్టణం 3 వార్డ్ రంగదాంపల్లి లోని శ్రీ హనుమాన్ దేవాలయం కు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గ్రానెట్ ను విరాళం గా అందించారు.. ఆలయ ప్రాంగణం లో నిర్మిస్తున్న అన్నదాన భవనం కు మీ వంతు సహకారం అందించాలని అన్నదాన భవనం కమిటీ ఇటీవల హనుమాన్ మాల బిక్షా సమయం లో గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు కలసి కోరగా ఇందుకు రూ.4లక్షల విలువ గల 4500 ఫీట్స్ గ్రానెట్ ను పంపించారు. శనివారం ఉదయం పార్టీ నాయకులు వంగ నాగిరెడ్డి, తిరుమల్ రెడ్డి, కనకయ్య తదితరులు ఆలయ కమిటీకి అందజేశారు.. అన్నదాన భవనం కు మేము అడగ గానే పూర్తి స్థాయి గ్రానెట్ ను అందించిన హరీష్ రావు కి దేవాలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.