Latest News
అన్నదాన భవనం కు గ్రానెట్ విరాళం గా ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు
16 Aug, 2025
231 Views
- సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయ అన్నదాన భవనం కు గ్రానెట్ విరాళం గా ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
- అన్నదాన భవనం అవసరమగు 4500 ఫీట్స్ గ్రానెట్ అందించిన హరీష్ రావు
-హరీష్ రావు కి ధన్యవాదాలు తెలిపిన అన్నదాన కమిటీ సభ్యులు, ఆలయ నిర్వహకులు.
సిద్దిపేట,ఆగస్టు 16(అవనివిలేకరి)సిద్దిపేట పట్టణం లో సుప్రసిద్ధ ఆలయం శ్రీ వెంకటేశ్వర దేవాలయం కు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గ్రానెట్ ను విరాళం గా అందించారు.. ఆలయ ప్రాంగణం లో నిర్మిస్తున్న అన్నదాన భవనం కు మీ వంతు సహకారం అందించాలని అన్నదాన భవనం కమిటీ ఇటీవల జరిగిన ఆలయ స్వర్నోత్సవాల సందర్బంగా హరీష్ రావు ని కోరారు. ఆరోజు హరీష్ రావు తప్పకుండ అందిస్తా అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తానే స్వయంగా ఆలయం వద్ద నిర్మిస్తున్న అన్నదాన భవనం ను సందర్శించి.. శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణుడు కావున నిత్యం ఇక్కడ అన్నదానం జరగాలి ఈ భవనం అద్భుతం గా నిర్మాణం చెప్పట్టాలని భవనం కు అవసరమగు గ్రానెట్ ను అందిస్తాని చెప్పారు. ఇందుకు రూ.4లక్షల విలువ గల 4500 ఫీట్స్ గ్రానెట్ ను పంపించారు.. శనివారం రోజున మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వార్డ్ కౌన్సిలర్ సాయి ఈశ్వర్ గౌడ్ లు భవన కమిటీ కి, ఆలయ ఈ ఓ కు, ఆలయ నిర్వహకులకు అందజేశారు. అన్నదాన భవనం కు మేము అడగ గానే పూర్తి స్థాయి గ్రానెట్ ను అందించిన హరీష్ రావు కి అన్నదాన భవన కమిటీ సభ్యులు సరాఫ్ అంజయ్య, రాములు, చంద్రహస్, యాద శ్రీనివాస్, ఆలయ చైర్మన్ నగేష్ విష్ణు, ఈ ఓ మారుతీ తదితరులు ధన్యవాదములు తెలిపారు.