Latest News

అపవాదు మాకు.. ఆర్భాటాలు మీకా.

08 Sep, 2025 159 Views
Main Image



అపవాదు మాకు.. ఆర్భాటాలు మీకా.
 కాళేశ్వరం కాదు కూళేశ్వరం అన్న రేవంత్.. మల్లన్న సాగర్ లో నీళ్లు ఎక్కడివి.. 
 శంకుస్థాపన దగ్గర చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.. 
కాళేశ్వరం కుంగితే నీళ్ల ప్రణాళికలేలా.
రూ7500కోట్లతో మూసి ప్రక్షాళన.
హైదరాబాద్ కు మల్లన్స సాగర్ ద్వారా నీటి తరలింపు..
మల్లన్న గుడిలో ముక్కు నేలకు రాసి తప్పు ఒప్పుకో.
- కేసీఆర్ కు, తెలంగాణ సమాజానికి  బహిరంగ క్షమాపణ చెప్పాలని బి ఆర్ ఎస్ డిమాండ్.. 
- బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ డిమాండ్

సిద్దిపేట,సెప్టెంబర్ 08(అవనివిలేకరి)లక్ష కోట్ల అవినీతి జరిగిందని. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణ కోరి, కేసీఆర్, హరీష్ రావు ల మీద నిందలు మోపిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లను తీసుకెల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, అపవాదులు  బీఆర్ఎస్ పార్టీకి, ఆర్భాటాలు. శంకుస్థాపనలు కాంగ్రెస్ పార్టీ కా అంటూ బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ విమర్శించారు. సోమవారం  సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం కుంగిందని దుష్ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకు రంగం సిద్ధం చేశారు... మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు గోదావరి నీళ్లు తరలించే ప్రక్రియ మొదలవుతుందన్నారు.రూ.7500 కోట్లతో హైదరాబాద్ తాగునీటి పథకం కోసం మూసి ప్రక్షాళన పేరిట  గండిపేట వద్ద సీఎం శంకుస్థాపన చేయనున్నారు...కాళేశ్వరం వృధా అని నీళ్లు లేవని అబద్ధాలు పలికిన సీఎం ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి నీటిని ఎలా పంపింగ్ చేస్తారు.. ముందు మల్లన్న సాగర్ లో స్నానం చేసి కొమరవేల్లి మల్లన్న గుడిలో తప్పు ఒప్పుకొని,కేసీఆర్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.. దాని తర్వాతే మూసీ ప్రక్షాళన కు కొబ్బరికాయ కొట్టాలి. మొన్న గందమల్ల కు శంకుస్థాపన ఇప్పుడు మూసి ప్రక్షాళన కు సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా సంబురాలు.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే గందమల్ల, మూసి ప్రక్షాళనకు వచ్చే గోదారి నీళ్లు అని సీఎం గుర్తు ఉంచుకోవాలి. ఇది వాస్తవం కాదా ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.. హైదరాబాద్ కు మల్లన్న  సాగర్ నుంచి 250 టీఎంసీల నీళ్లు పంపింగ్ చేయాలని ప్రభుత్వం ఆలోచన నిజం కాదా..రూ 7300కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు కు గోదారి నీళ్లు పంపింగ్ చేస్తున్నారని, అసత్య ప్రచారాలు సీఎం చేస్తున్నారురాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు..కాళేశ్వరం ద్వారా సిద్దిపేట జిల్లాలో3లక్షలు. సిరిసిల్లలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందింది.ఇది నిజమా అబద్దమా ప్రభుత్వం జవాబు ఇవ్వాలన్నారు.స్థానిక ఎన్నికల్లో లబ్ది కోసమే అసెంబ్లీలో కాళేశ్వరం మీద దుష్ప్రచారం సీబీఐ విచారణ డిమాండ్ చేయడంప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని  ఎప్పటికైనా ధర్మం. న్యాయం విజయం సాధిస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహన్ లాల్, చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్, సీనియర్ నాయకులు  ఎల్లారెడ్డి, ప్రభాకర్ వర్మ, కొండం రవీందర్ రెడ్డి, శ్రీహరి యాదవ్,   సదానందం,  మాజీ సర్పంచ్ ఆంజనేయులు, పర్శరాములు,   మేరుగు మహేష్, శ్రీనివాస్ రెడ్డి, ఇరుగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.