Latest News

అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతం..

19 Sep, 2025 166 Views
Main Image
అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతం..
చరిత్రలో నిలిచిపోయే ఘట్టం
రైతుల కలలు నేరవేరుతున్నాయి
సంతోషం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు
నంగునూరు, సెప్టెంబర్ 19(అవనివిలేకరి) సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలోని పామ్ ఆయిల్ కర్మాగారం ట్రయల్ రన్  చేశారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. ఆయిల్ పామ్ కర్మాగారం ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ చేసిన ఈ పామాయిల్ కర్మాగారం నేడు ప్రారంభ దశకు చేరుకుందని, ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా అభివృద్ధి చెందుతుందని హరీశ్ రావు అన్నారు. బతుకమ్మ, విజయదశమి పండుగల వేళ ఈ సంతోషకరమైన ఘట్టం చోటు చేసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతుల కలలు తీరుతున్నాయని అన్నారు. ఒక వైపు ఆయిల్ ఫామ్ సాగు వేగంగా కొనసాగుతుండగా, మరో వైపు కర్మాగారం ప్రారంభ దశకు చేరుకోవడం రైతుల్లో నూతన నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు. ఇది నిజమైన రైతు పండుగ అని, రైతులు ఆశించిన లాభాలు  అందుబాటులోకి రానున్నాయని హరీశ్ రావు తెలిపారు. అతి తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో ఈ కర్మాగారం పనిచేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, రైతులకు దీనివల్ల ప్రత్యక్ష లాభాలు కలుగుతాయని తెలిపారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.