Latest News

అల్లూరి జిల్లాలో అద్భుతం – మానవ రూపంలో తియ్యదుంపలు.

09 Oct, 2025 82 Views
Main Image

అల్లూరి జిల్లాలో అద్భుతం – మానవ రూపంలో తియ్యదుంపలు.

 

చింతపల్లి,అక్టోబర్ 09(అవనివిలేకరి) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలో ఒక విశేషం చోటుచేసుకుంది. రైతు పొలంలో పండిన తియ్యదుంపలు (చిలకడదుంపలు) మానవ రూపాన్ని పోలి ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.గ్రామస్తులు ఆసక్తిగా వీటిని చూడటానికి తరలివస్తున్నారు. కొందరు ఇవి సహజ ప్రకృతి అద్భుతమని భావిస్తే, మరికొందరు దీన్ని దేవుని సంకేతంగా భావిస్తున్నారు.రైతు కుటుంబం కూడా ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి తమ పొలంలో పండలేదని చెబుతోంది.తియ్యదుంపలు మానవ ముఖం,చేతులు,కాళ్ల ఆకృతుల్లా కనిపించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.