Latest News
ఆందోళన కలిగిస్తున్న యూరియా కొరత.
23 Aug, 2025
38 Views
ఆందోళన కలిగిస్తున్న యూరియా కొరత.
యూరియా కోసం చెప్పులను క్యూలైన్లో పెట్టి ఎదురుచూస్తున్న రైతులు
యూరియా అందక నిరాశతో వెనుదిరిగిన వైనం
రాయపోల్/ దుబ్బాక ఆగస్టు 23(అవనివిలేకరి)రైతును రాజుగా మారుస్తా మని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు కాసే పరిస్థితికి తీసుకువచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు సెలవులు రావడంతో యూరియా కోసం రాత్రి, పగలు తేడా లేకుండా తిండితిప్పలు మానుకొని ప్రాథమిక సహకార సంఘం, రైతు ఆగ్రో సేవా కేంద్రా లకు తిరిగినా యూరియా దొరకక నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామ ఫర్టిలైజర్ షాప్ కు లారీ లోడ్ యూరియావచ్చిందని తెలియడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి క్యూ లైన్ లో చెప్పులు పెట్టి యూరియా కోసం పడి కాపులు కాశారు. క్యూ లైన్ లో నిలబడినప్ప టికీ అధికారులు యూరియా తక్కువగా ఉంది, రైతులు మాత్రం పెద్ద ఎత్తున క్యూలో ఉండడంతో కంగుతిన్న వారు పోలీసులు సాయంతో యూరియాను పంపిణీ చేస్తామని తెల్చడంతో అప్పటి వరకు క్యూ లైన్లో నిలబడ్డ రైతులు అలసట రావ డంతో తమకు బదులుగా చెప్పులను క్యూలో పెట్టారు.అయినా చాలా మందికి యూరియా దొరకకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చిన విషయం తెలుసుకున్న ఆత్మ కూర్ మండల వ్యవసాయ అధికారి నరేష్. మండల తాహసిల్దార్ కృష్ణమోహన్. తొగుట సిఐ షేక్ లతీఫ్. బేగంపేట ఎస్సై మైపాల్ రెడ్డి. అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి క్యూ లైన్ ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారులు అందించిన టోకెన్ల ప్రకారం ప్రతి రైతుకు ఒక బస్తా యూరియాను అందించారు.యూరియా దొరకని రైతులు నీరాశపడవద్దని మరో లారీ యూరియా లోడ్ వస్తుందని రైతులకు నచ్చజెప్పారు. యూరియా ప్రతి రైతుకు ఒక బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని రైతులు వ్యవసాయ అధికారులను నిలదీశారు. దీంతో పోలీస్ పహారాలో ప్రతి రైతుకు ఒక బస్తా యూరియాను అందించారు.