ఆదివారం ఆఫీసులో బిజీబిజీ..
ఎంపీడీవో కార్యాలయంలో వర్క్ బిజీలో అధికారులు..
సిద్దిపేట అర్బన్,ఆగస్టు 31 (ఆవని విలేకరి)ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అధికారులు ఆఫీస్ లో వర్క్ బిజీ లో నిమగ్నమయ్యారు. ఓటర్ల తుది జాబితాలో అనేక ఫిర్యాదులు రావడంతో సిద్దిపేట ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు పనిలో బిజీ అయిపోయారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తూ స్థానిక ఎంపీ ఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఆపరేటర్లు సమస్యల పరిష్కారానికి ఓటర్ల తుది జాబితాను తయారు చేయడానికి కార్యాలయంలో పనిలో నిమగ్నమైనట్లు ఎంపీ ఓ నాగేశ్వరరావు తెలిపారు. కాగా ఓటర్ల తుది జాబితా సోమవారం జిల్లా కార్యాలయంలో అందించాల్సి ఉండడం వలన ఆదివారం సెలవు తీసుకోకుండా వచ్చిన ఫిర్యాదులన్నింటిని దాదాపు పరిష్కారం చేసేటట్టుగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.