ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ బాబు రావుకు చేయూత కేటగిరీలో రాష్ట్రస్థాయి అవార్డు
సిద్దిపేట అర్బన్,ఆగష్టు19(అవని విలేకరి)ప్రపంచ ఫొటోగ్రఫీదినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ బి.బాబు రావు కు చేయూత కేటగిరీలో రెండొవ బహుమతి దక్కింది.ఈ పోటీలో 94 ఎంట్రీలు రాగా,అందులో 744 ఫొటోలతో పోటీపడి బి.బాబురావుకు మంగళవారం హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో రాష్ట్ర సమాచార,గృహ నిర్మాణ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె,శ్రీనివాస్ రెడ్డి ,తెలంగాణ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ కమిషనర్ సిహెచ్.ప్రియాంక పాల్గొన్నారు.