ఆయిల్ ఫామ్ తోటలలో అంతర్ పంటలను సాగు చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు శనివారం ఉదయం ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట తదితర ప్రాంతాల్లో సాగు చేస్తున్న పంటలను పరిశీలించడం కోసం వెళ్లారు .సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి, దుబ్బాక, నంగునూరు తదితర గ్రామాల రైతులకు ఆయిల్ ఫాం సాగు అంతర్ పంటల సాగు విధానంపై అధికారులు రైతులను ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో వేలాది ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు అవుతుంది. మండలంలోని నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ కర్మాగారం నిర్మాణం అవుతుండడంతో రైతులు ఆసక్తిగా పామాయిల్ తోటలను సాగు చేస్తున్నారు. అయితే చాలామంది రైతులు పామాయిల్ తోటలలో అంతర్ పంటలను సాగు చేయడం లేదు.దీంతో రైతులకు పంటలలో అంతర్ పంటలు సాగు చేస్తే రైతులు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ప్రయత్నంలో భాగంగా సంబంధిత అధికారులు రైతులను ఖమ్మం జిల్లాలో అక్కడి రైతులు సాగుచేసిన పామ్ అయిల్ అంతర్ పంటలను పరిశీలించడం కోసం వాహనాల్లో అక్కడికి తీసుకెళ్లి అవగాహన కల్పించనున్నారు.