Latest News

ఆయిల్ పామ్ తోటలో అంతర్ పంటలు సాగు ఎంతో లాభదాయకం

06 Sep, 2025 78 Views
Main Image
ఆయిల్ పామ్ తోటలో అంతర్ పంటలు సాగు ఎంతో లాభదాయకం
- ఆయిల్ ఫెడ్ అధికారి ఫణింద్ర 
- సిద్దిపేట జిల్లా రైతులకు అవగాహన
ఖమ్మం,సెప్టెంబర్ 06(అవనిప్రతినిధి)ఆయిల్ ఫామ్ తోటల్లో అంతర్ పంటలు ఎంతో లాభదాయకమని ఆయిల్ ఫెడ్ అధికారి ఫణీంద్ర సూచించారు. శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట సమీపంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాగుచేసిన ఆయిల్ ఫామ్ తోటలో కోకో ,వక్క పంటల సాగును సిద్దిపేట జిల్లాలోని నంగునూరు,దుబ్బాక,మిరుదొడ్డి మండలాల రైతులు పరిశీలించారు. అనంతరం ఆయిల్ ఫెడ్ అధికారి ఫణింద్ర రైతులకు అవగాహన కల్పించారు.చింతపల్లి గ్రామానికి చెందిన రైతు,నర్సరి నిర్వాహకులు ఎస్ కే బాజీ క్షేత్రంతోపాటు ప్లాంట్ ను సందర్శించిన అనంతరం వివిధ ప్రాంతాలలో సాగవుతున్న కోకో,వక్క పంటల పై  అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా ఫణీంద్ర మాట్లాడుతూ పామాయిల్ తోటల్లో  ఎకరాకు 250 చొప్పున మొక్కలు నాటుకోవచ్చునని ఫలితంగా అదనంగా ఎకరాకు 50 వేల వరకు సంవత్సరానికి ఆదాయం వస్తుందన్నారు సంవత్సరానికి ఒకసారి పంట చేతికి వస్తుందని ఐదు సంవత్సరాలకు మొదటి క్రాపు వస్తుందని ఆయన వివరించారు. అదేవిధంగా సాగు చేస్తే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని ఆయన తెలిపారు. వక్క ,కోకో పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు, కార్యక్రమంలో ఆయిల్ పేడ్ అధికారులు శ్రీకర్ రెడ్డి,నితీష్, హరీష్ , ఆంజనేయులు,రైతులు రాగుల సారయ్య, బద్దిపడగ కిష్టారెడ్డి, కూతురు రాజిరెడ్డి, మహిపాల్ రెడ్డి,రంగు రాజు, రమేష్ రాజు, నాగేంద్రం, యెల్లెంకి రవీందర్ రెడ్డి,నిమ్మ వెంకట్ రెడ్డి,వల్లపు రెడ్డిరాంరెడ్డి, విజేందర్ రెడ్డి, ఉల్లిమల్లయ్య, ఎడ్ల రవీందర్ రెడ్డి, రమేశ్,రాకేష్, కృష్ణ నర్సింలు,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.