Latest News

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన అదనపు కలెక్టర్ అగ్రవాల్

29 Aug, 2025 169 Views
Main Image
నిర్మాణమవుతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన అదనపు కలెక్టర్ అగ్రవాల్ 
సిద్దిపేట ,ఆగస్టు 29(అవనివిలేకరి)సిద్దిపేట జిల్లానంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామం లో దాదాపు 300 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ కర్మగారాన్ని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. కర్మాగార ఆవరణ మొత్తం కలియతిరిగారు. ఆయిల్ ఫామ్ కర్మగార పనులు తుది దశకు చేరుకున్న మూలంగా యంత్రాలు నడిచే ప్రక్రియలో మొదటి దశ నుండి ఆయిల్ ఉత్పత్తి దశ మరియు క్రూడ్ ఆయిల్ తయారీ వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. కర్మాగార ఆవరణలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, పక్కన డ్రైనేజీ నిర్మాణ సైతం వేగంగా పూర్తి చేయాలని ఆయిల్ఫేడ్ అధికారులకు ఆదేశించారు. మిగతా ఫ్యాక్టరీ పనులు సైతం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఉద్యానవన, ఆయిల్ ఫ్రైడ్ అధికారులను ఆదేశించారు.అదనపు కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ,  ఆయిల్ ఫ్రైడ్ ఇంజనీర్లు తదితరులు ఉన్నారు.