ఆసుపత్రులపై దాడులను అరికట్టాలి.
- పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందించిన వైద్యులు
సిద్ధిపేట, ఆగస్టు 23(అవనివిలేకరి)వైద్యం అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం లేకపోయినా కొంతమంది ఆస్పత్రులపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, దీనిని నివారించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ అసోసియేషన్లకు చెందిన వైద్యులు శనివారం సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేటలోని ఆసుపత్రులలో రోగులకు వైద్యం చేస్తుండగా దురదృష్టవశాత్తు ప్రాణహాని జరిగినపుడు క రోగికి సంబంధము లేని వారు ఆసుపత్రులకు వచ్చి అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తున్నారని వాపోయారు.
డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. నిజంగా వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగితే న్యాయ పరంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దౌర్జన్యాలు చేయటము సరికాదని అన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో లభించే చికిత్స ఇక్కడ లభిస్తున్నా కొందరి ఆగడాలతో చికిత్స చేయడానికి భయపడి హైదరాబాద్ పంపే పరిస్థితి వస్తోందని తెలిపారు. దీనివల్ల రోగి మార్గమధ్యంలో మరణిసున్నారని, వారిపై ఆర్ధిక భారం కూడా ఎక్కువ పడుతుందని తెలిపారు. ఇలాంటివి జరగకుండా చూడాలని పోలీస్ కమిషనర్ కు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. .. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక నుండి ఏ హాస్పిటల్స్ దాడులకు దిగే వారిపై యాక్ట్ నం 11ఆఫ్ 2008 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ వైద్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డా.రామచందర్ రావు, డా.చంద్రారెడ్డి, సుగుణా సతీశ్, ఎస్.శ్రీనివాస్, దేవేందర్, రజననీ గంధ, అరుణ, శ్రీలక్ష్మి, ఐఎంఏ అధ్యక్షుడు చందర్, ఉపాధ్యక్షుడు భాస్కర్ వీవీ రావు, భీమేశ్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.