Latest News
ఈ నెల 13 న సిద్దిపేటలో మెగా జాబ్ మేళా
11 Sep, 2025
53 Views
ఈ నెల 13 న సిద్దిపేటలో మెగా జాబ్ మేళా
సిద్దిపేట,సెప్టెంబర్ 11(అవనివిలేకరి)ఈ నెల 13వ తేదీన సిద్దిపేట విపంచి కళా నిలయంలో మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు చొరవతో నిర్వహించే మెగా జాబ్ మేళాను సిద్దిపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని బీ ఆర్ ఎస్ పార్టీ సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయి రాం, ఆంజనేయులు కోరారు. జాబ్ మేళా కరపత్రాన్ని నిర్వాహకులతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగం లభించక ఖాళీగా ఉంటున్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈనెల 13వ తేదీన సిద్దిపేటలో నిర్వహించే మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు హాజరై తమ కలను సాకారం చేసుకోవాలని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కృషితో ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని, తమ చదువుకు సార్ధకత చేకూర్చుకోవాలని తద్వారా తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని సూచించారు. పదవ తరగతి నుండి ఇంజనీరింగ్ చదివిన యువతి యువకులకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. ఈ జాబ్ మేళాలో 20 కంపెనీలకు చెందిన 40 మంది హెచ్ ఆర్ లు పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు కరపత్రం లోని క్యూ ఆర్ కోడ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు. ఇంజనీరింగ్ పట్టభద్రులకు టెక్ మహేంద్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు, ఐటీఐ వాళ్లకు ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు.జాబ్ మేళా కు వచ్చే యువత నాలుగు సెట్ల బయోడేటా తీసుకురావాలని తెలిపారు..