Latest News

ఉపాధ్యాయులకు తరగని ఆస్తి విద్యార్థులే

18 Sep, 2025 30 Views
Main Image
ఉపాధ్యాయులకు తరగని ఆస్తి విద్యార్థులే
- ఎల్లెంకి శ్రీనివాసరెడ్డి, డీఈవో, సిద్ధిపేట 

సిద్ధిపేట,సెప్టెంబరు18(అవనివిలేకరి)ఉపాధ్యాయులకు తమ ఉద్యోగ జీవితంలో తరగని ఆస్తి వారి వద్ద చదువుకున్న విద్యార్థులేనని సిద్ధిపేట జిల్లా విద్యాధికారి ఎల్లెంకి శ్రీనివాసరెడ్డి అన్నారు. చిన్నకోడూరు మండలం రామంచ ప్రాథమిక పాఠశాల ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ షరీఫ్ ఉద్యోగ విరమణ వీడ్కోలు సమావేశం గురువారం జరిగింది. ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు యాంసాని వెంకట సురేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎల్లెంకి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుల పనితీరుకు వారి ఉద్యోగ విరమణ సమావేశానికి హాజరయ్యే పూర్వ విద్యార్థులే నిదర్శనంగా నిలుస్తారన్నారు. అబ్దుల్లా షరీఫ్ తన ఉద్యోగ జీవితంలో విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేశారని చెప్పారు. రామంచ పాఠశాలను నాలుగు సార్లు సందర్శించానని చెప్పారు. ఒక తరగతిలో శతశాతం పిల్లలు  విద్యా ప్రమాణాలు సాధించడం అభినందనీయమన్నారు. రామంచ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశానికి 90 శాతం తల్లిదండ్రులు సమావేశానికి రావడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలని కోరారు. జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలకు 36 సంవత్సరాల పాటు బంగారు బాట వేసిన షరీఫ్ ను అభినందించారు. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు మాత్రమే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు. పేద పిల్లలు చదివే విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ  మాట్లాడుతూ మంచి విద్యార్థులను తయారు చేయడంలో షరీఫ్ బృందం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల కృషికి తల్లిదండ్రులు చేయూత ఇవ్వాలని కోరారు. టీ ఎన్ జీ వో అసోసియేషన్ జిల్లా కోశాధికారి అశ్వక్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి షరీఫ్ చేసిన కృషి గొప్పది అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన అబ్దుల్లా షరీఫ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కూరెళ్ళి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ బ్రహ్మం, చిన్నకోడూరు మండల విద్యాధికారి సత్తు యాదవరెడ్డి, తిరుపతి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లక్మయ్య, సత్తవ్వ, షౌకత్ ఆలీ, సముద్రాల శ్రీనివాస్, గుండా వేణుగోపాల్, గౌసోద్దీన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పద్మారెడ్డి, ఉపాధ్యాయులు వరప్రసాద్, యాదయ్య, సునీత, నాగమణి, అబేదా బేగం, వాణి, స్వరూప, రామిని భాస్కర్, గంగాభవాని,  కత్తి మల్లయ్య, నరేందర్, ఉపాధ్యాయులు   తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.