Latest News

ఎరువులు ఇవ్వలేకపోతే గద్దె దిగాలి.

15 Aug, 2025 104 Views
Main Image
నంగునూరు, ఆగస్టు 15(అవనివిలేకరి)ఎరువులు ఇవ్వడం చేత కాకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేసి గద్దె దిగాలని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పర్యటనలో భాగంగా శుక్రవారం పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద ఎరువుల కోసం క్యూలో ఉన్న రైతులను చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగారు. రైతుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రం లో ఎక్కడ చుసిన ఎరువుల కోసం రైతుల క్యూ లైన్లు కనపడుతున్నాయని చెప్పారు. ఎన్నికలప్పుడు తిరిగిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఇప్పుడు ఎరువుల కోసం రైతులక్యూ లైన్ల వద్దకుకు రావాలని డిమాండ్ చేశారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో కనపడని లైన్లు ఇప్పుడు ఎందుకు కనపడుతున్నాయని ప్రశ్నించారు. చేతగాని  దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకరినొకరు విమర్శించడం మాని రైతులకు ఎరువులు కొరత తీర్చాలని రిమాండ్ చేశారు. 16 మంది ఎంపీలుగా గెలిచి రాష్ట్రానికి గుండు సున్నా తెచ్చారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ఎరువులు పోతుంటే, 14 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన మార్పు.. పదేళ్ల లో ఎరువుల కోసం లేని క్యూ లైన్లలో నిలబడలేక రైతులు చెప్పులు పెట్టే పరిస్థితి తెచ్చింది అన్నారు.