Latest News

ఎరువుల కొరత లేదు

21 Aug, 2025 44 Views
Main Image

పాపన్నపేట మండలంలో ఎరువుల కొరత లేదు


:ఏఓ నాగమాధురి      
 మెదక్,ఆగస్టు21(అవనివిలేకరి) పాపన్నపేట మండలంలో ఎరువుల కొరత లేదని పాపన్నపేట మండల వ్యవసాయాధికారిని నాగమాధురి అన్నారు. గురువారం రోజు ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ  కొంత మంది రైతులు తొందర పడి సెప్టెంబర్ మాసానికి కావాల్సిన యూరియాను ఇప్పుడే కొనుగోలు  చేస్తుండటంతో  కొరత ఏర్పడిందని చెప్పారు. రాబోయే10 రోజుల్లో జిల్లాకు 1000 నుండి 1500 టన్నుల యూరియా వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారన్నారు. సెప్టెంబర్ నెలకు సరిపడా 4 వేల టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.