మద్దూర్ మండల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇంజనీరింగ్ కన్సల్టెంట్ బండకింది పర్షరాములు ఏసీబీకి పట్టు బడ్డారు. ఏసీబీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పర్షరాములు ఫైళ్ల చెక్ కొలతను ధృవీకరించడం, పూర్తి చేయడం, బిల్లు ఆమోదం కోసం ఉన్నత అధికారులకు పంపడం కోసం ఫిర్యాదుదారుడి నుండి రూ. 11,500 లంచం డిమాండ్ చేశారు.ఈ క్రమంలో మద్దూరు ఎంపిడివో కార్యాలయంలో పర్శరాములు లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.