ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
అదిలాబాద్,ఆగస్టు 22(అవనివిలేకరి)ఏసీబీ వలకు మరో అధికారి చిక్కాడు. లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు.శుక్రవారం మధ్యాహ్నం రిజిస్ట్రార్ కార్యాయంలో బాధితుడు మన్నూర్‌ఖాన్ నుంచి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.బేల మండలం సిరిసన్నకు చెందిన మన్నూర్ ఖాన్ గిఫ్ట్ డీడ్ కోసం డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గిఫ్ట్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్‌రూ. 10 వేలు డిమాండ్ చేశారు.రూ.5 వేలకు ఒప్పందం కుదరగా మధ్యాహ్నం సమయంలో సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారితోపాటు సిబ్బందిని విచారిస్తున్నారు.