Latest News

కాంగ్రెస్ గ్యారెంటీలకు నో గ్యారెంటీ..

02 Sep, 2025 31 Views
Main Image

కాంగ్రెస్ గ్యారెంటీలకు నో గ్యారెంటీ..

 

బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్


హామీలు అమలు చేయాలని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా


సిద్దిపేట అర్బన్,సెప్టెంబర్02(అవని విలేకరి)ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయిందని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 66 సబ్ గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఏఒక్క హామీకి గ్యారెంటీ లేదని ఎన్నికల సమయంలో గొప్ప వాగ్దానాలు చేసినా అమలులో విఫలమైందని మండిపడ్డారు.ప్రభుత్వం వేలకోట్ల అప్పులు చేసినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు.రైతులకు 15 వేల రూపాయలు రైతు భరోసా,మహిళలకు నెలకు 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.గృహ జ్యోతి పథకం పేరుతో మహిళలకు ప్రభుత్వం మోసం చేసిందన్నారు.వృద్ధులకు 2,000 నుండి 4,000 రూపాయలు వికలాంగులకు 3,000 నుండి 6,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతులకు అన్ని పంటలకు బోనస్ ఇచ్చి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బైరి శంకర్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వంగ రామచంద్ర రెడ్డి,రామచంద్ర రావు,జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి,గాడిపల్లి భాస్కర్,విభీషణ్ రెడ్డి,జస్వంత్ రెడ్డి,సుభాష్ రెడ్డి,సంతోష్,ఉమారెడ్డి,పద్మ తదితరులు పాల్గొన్నారు.