కొండపాక మండలంలో భారీ వర్షం..
- ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు.
- పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
కొండపాక ఆగస్టు 28 (అవని విలేఖరి)మండల పరిధిలోని చెరువులు కుంటలు నిండి కళకళలాడుతున్నాయి. మండల కేంద్రం, దుద్దెడ, సిరిసనగండ్ల, మర్పడగా, తిమ్మారెడ్డిపల్లి, వివిధ గ్రామాలలో గురువారం భారీ వర్షాల కారణంగా చెరువులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులను, వాగులను చూడడానికి బారులు తిరిన ప్రజలు. నిండుకుండలా మారిన ఊర చెరువులు, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు కొండపాక నుండి జప్తి నాచారం వెళ్లేదారి దుద్దెడ నుండి అంకిరెడ్డిపల్లి, బందారం గ్రామాలకు వెళ్ళే దారులు మూసుకుపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. కొన్నిచోట్ల వరి పొలాలు నీటితో నిండిపోయాయి, ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.