Latest News

కరెంట్ షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి రెడ్డి సంక్షేమ సంఘం అండ

30 Aug, 2025 100 Views
Main Image
కరెంట్ షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి రెడ్డి సంక్షేమ సంఘం అండ 

చిన్నకోడూరు, ఆగస్టు 30(అవనివిలేకరి)సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనలో గజేందర్ రెడ్డి,  రాజిరెడ్డి అనే తండ్రి-కొడుకులు కరెంటు షాక్‌కు గురై మృతి చెందారు. సిద్దిపేట  ప్రశాంత్‌నగర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పేరడీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని అందించాలని ఆకాంక్షించారు.సంఘం తరఫున బాధిత కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బాల్ రెడ్డి,  మారెడ్డి మల్లికార్జున్ రెడ్డి, రాజలింగారెడ్డి, వట్టిపల్లి రాజిరెడ్డి, రవికిరణ్, వెంకటేశ్వర రెడ్డి, చంద్రారెడ్డితదితరులు పాల్గొన్నారు.