Latest News

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు నిరసనగా బీఆర్ఎస్ రాస్తారోకో

02 Sep, 2025 88 Views
Main Image
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు నిరసనగా బీఆర్ఎస్ రాస్తారోకో
సిద్ధిపేట - హన్మకొండ రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు
 సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
 కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వర ప్రదాయిని
 నంగునూరు, సెప్టెంబర్ 2(అవనివిలేకరి)కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేయడాన్ని నిరసిస్తూ సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. నంగునూరు మండలంలోని పాలమాకుల వద్ద సిద్ధిపేట హన్మకొండ రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట–హన్మకొండ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నంగునూరు మండల శాఖ అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్  ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాగుల సారయ్య జాప శ్రీకాంత రెడ్డి, దువ్వల మల్లయ్య, వేముల వెంకటరెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, కోల రమేశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, బద్దిపడగ కిష్టారెడ్డి,  రాజిరెడ్డి లు మాట్లాడుతూ ప్రతిపక్షాలను అణచి వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావుపై తప్పుడు కేసులు  ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయని అని వివరించారు. ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు  కమాల్ షరీఫ్, కమలాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రంగు రాజు, అజీజ్ ,  సతీష్, వేణు , బాబు,బాస్కర్ రెడ్డి, చక్రపాణి,బాల్  రత్నం, రవీందర్ రెడ్డి, తిరుపతి,జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,పర్శరాములు,సిద్దూ, శ్రీనివాస్,కుమార్,  రెడ్డి,శ్రీనివాస్,రాజెల్లయ్య, ఐలయ్య, వేణు,నారాయణ, వేణుచక్రవర్తి, రాజయ్య,మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ యువజన నాయకులు,విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.