Latest News

కీసర, రాంపల్లిలో 50 కోట్ల విలువ సర్వేనెంబర్ 385 భూమి నకిలీ పత్రాలతో కబ్జా యత్నం.

23 Sep, 2025 49 Views
Main Image


కీసర, రాంపల్లిలో 50 కోట్ల విలువ సర్వేనెంబర్ 385 భూమి నకిలీ పత్రాలతో కబ్జా యత్నం.
 కీసర రాంపల్లి లో భూకబ్జాదారుల ఆగని దందాలు
  రాంపల్లి మెయిన్ రోడ్ లో సర్వేనెంబర్ 385  భూ అక్రమణ 
 సుబ్బారెడ్డి అనే వ్యక్తి రౌడీ మూకలతో దాడి
  రెవెన్యూ అధికారుల అండతో నకిలీ పత్రాలు సృష్టించి భూఆక్రమణ
  గత 26 ఏళ్లుగా అన్ని పత్రాలు కలిగియుండి భూస్వంతదారులు రేఖా రెడ్డి ,రజిత రెడ్డిలు
 కీసర పరిధి పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
మేడ్చల్ మల్కాజిగిరి, సెప్టెంబర్ 23 (అవని ప్రతినిధి)రాంపల్లి మెయిన్ రోడ్ కు ఆనుకొని ఉన్న సర్వేనెంబర్ 385 గల భూమి గత 26 ఏళ్లుగా నీటి పన్ను విద్యుత్ పన్ను అన్ని పత్రాలతో కలిగి భూసంతదారులు రజిత రెడ్డి రేఖ రెడ్డిలు స్థానికంగా  ప్రభుత్వపరంగా అన్ని పత్రాలు కలిగి ఉండగా సుబ్బారెడ్డి అనే వ్యక్తి 50 కోట్ల విలువ గల భూమిపై కన్ను వేసి రెవెన్యూ అధికారులు ద్వారా నకిలీ పత్రాలు సృష్టించుకుని ఆక్రమణకు పాల్పడుతున్నాడని తెలుస్తుంది. 50 మందితో  వచ్చి సిసి కెమెరాలను ధ్వంసం చేసి నిర్మాణాలను కూల కొట్టాడని, మా భూమిని కాపాడాలని భూ బాధితులు రజిత రెడ్డి, రేఖా రెడ్డిలు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు. రజిత రెడ్డి రేఖ రెడ్డిలు వారు కొనుగోలు చేసిన ఎకరా భూమిని 1999 లో జెమ్మల నాగేష్ గౌడ్ నుండి కొనుగోలు చేశామని మీడియా ముందు తెలిపారు. ఈ సమావేశంలో జెమ్మల నగేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ భూమిని 1999లో రజిత రెడ్డి రేఖా రెడ్డిల తల్లి భారతికి అమ్మడం జరిగిందని సుబ్బారెడ్డి సృష్టించిన పత్రాలు మేము సంతకం చేయలేదని ఆ పత్రాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని మీడియా ముందు స్పష్టం చేశారు. అసలు సుబ్బారెడ్డి ఎవరో మాకు తెలియదని, తాను ఎవరికి అమ్మలేదని ఎటువంటి సంతకాలు చేయలేదని రేఖా రెడ్డి, రజిత రెడ్డిల కుటుంబ సభ్యులకు భూమి విక్రయం చేసినట్లు విలేకరుల సమావేశంలో జమ్మల నగేష్ గౌడ్ పేర్కొన్నారు. కీసర పోలీస్ స్టేషన్లో సుబ్బారెడ్డి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అన్నారు తమ భూమిని కాపాడమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మీడియా ద్వారా ఆవేదన వ్యక్తపరిచారు.