Latest News

గంటసేపు రాజీవ్ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

19 Aug, 2025 72 Views
Main Image

ఎరువుల కొరత తీర్చాలని రాజీవ్ రహదారిపై ఇబ్రహీం నగర్ బీఆర్ఎస్ రాస్తారోకో

యూరియా కోసం  రాజీవ్ రహదారి దిగ్బంధం

గంటసేపు రాజీవ్ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

ఎరువులు తెస్తారా రాజీనామా చేస్తారా ఆలోచించుకోవాలని హెచ్చరిక


సిద్ధిపేట, ఆగస్టు 19(అవనివిలేకరి)కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా మంచి జరిగితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపించాయి. ఎరువుల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట పాటు రాజీవ్ రహదారి దిగ్బంధం చేసారు. దీంతో రాజీవ్ రహదారిపై గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో లేని ఎరువుల కొరత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొరతే అని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యూ లైన్ లు కట్టి యూరియా కోసం పడిగాపులు పడిన రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతం అయ్యాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ముందు చూపుతో పంటకు ముందే గోదాముల్లో యూరియాను నిల్వ పెట్టించే వారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపు చూస్తోందని మండి పడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువులు ఇవ్వడంలో విఫలం అయ్యాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు ఎరువులు తీసుకు పోతున్నా. సోయి లేకుండా దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డితో పాటు 16 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎరువులు ఇవ్వ చేత కాకుంటే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఎరువులు తెస్తారా రాజీనామా చేస్తారా అనేది ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామంలోని రైతు పంట పొలం దగ్గరికే యూరియా వచ్చేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా దుకాణం దగ్గరికి పోయిన దొరికే పరిస్థితి లేదని మండి పడ్డారు. ఎరువుల కొరత తీర్చకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా చెప్పుల లైన్లు పోవాలంటే కాంగ్రెస్ సర్కార్ చెంప చెల్లు మనాలి, రైతులకు ఎరువులు లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి, ఎరువులు తెస్తారా రాజీనామా చేస్తారా ఆలోచించుకోండి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యార్థి, యువజన మహిళా విభాగాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.