Latest News
గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి - మేయర్ విజయలక్ష్మీ
03 Sep, 2025
36 Views
మీ వార్డులలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
– ఏర్పాట్లపై కార్పొరేటర్ లకు మేయర్, మేయర్ కార్యాలయం సిబ్బంది ఫోన్ ద్వారా ఆరా
– జీహెచ్ఎంసీ చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కార్పొరేటర్ లు
హైదరాబాద్, సెప్టెంబర్ 03, (అవనిప్రతినిధి)మీ వార్డులలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటూ నగరంలోని కార్పొరేటర్ కు బుధవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి, మేయర్ కార్యాలయం సిబ్బంది ఫోన్ చేసి ఆరా తీశారు.గణేష్ ఉత్సవాలలో కీలకంగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ ఇప్పటికే నగర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు, ఉత్సవాలలో కీలక ఘట్టమైన నిమజ్జనం సజావుగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేసింది.శానిటేషన్, లైటింగ్, నిమజ్జన శోభ యాత్ర మార్గాలలో రోడ్డు మరమ్మతులు , నిమజ్జన పాయింట్ లలో ఏర్పాట్లపై వివరాలు అడిగారు.దాదాపు అందరు కార్పొరేటర్లు తమ వార్డుల పరిధిలో ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.ఒకరిద్దరూ కార్పొరేటర్ లు తమ వార్డులలో నిమజ్జన ఊరేగింపు మార్గాలలో అక్కడక్కడ గుంతలు, కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్, క్లీనింగ్ సమస్యలు ఉన్నాయని, చెట్ల కొమ్మల కత్తిరింపులు చేయాలని కోరారు.కార్పొరేటర్ లు స్థానిక అధికారులతో సహకారంతో తమ వార్డులలో నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.
జోనల్ కమిషనర్ లతో మేయర్ టెలీ కాన్ఫరెన్స్
-పెండింగ్ పనుల సత్వర పూర్తికి ఆదేశం
స్పందించిన మేయర్ అన్ని జోనల్ కమిషనర్ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ పనులు ఏమైనా ఉంటే క్షేత్ర సిబ్బందిని పురమాయించి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ లకు సూచించారు.