Latest News

జర్నలిస్టులు సిద్దిపేట అభివృద్ధిని ముందుకు తీసుకెల్లే బాధ్యత తీసుకోవాలి

14 Sep, 2025 58 Views
Main Image

జర్నలిస్టులు సిద్దిపేట అభివృద్ధిని ముందుకు తీసుకెల్లే బాధ్యత తీసుకోవాలి


- తన్నీరు హరీశ్ రావు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే 


సిద్దిపేట, అవనివిలేకరి)వివిధ రాష్ట్రాలకు అభివృద్ధి పాఠాలు నేర్పి. ప్రగతి ప్రయోగశాలగా నిలిచిన సిద్దిపేటలో నేడు అభివృద్ధి అర్ధాంతరంగా నిలిచిందని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

రెండేళ్ల కిందటి వరకు విజయ గాధలతో అభివృద్ధిపేటగా వర్ధిల్లిన సిద్దిపేటలో అభివృద్ధిపై సాగుతున్న అక్కసు ఆందోళన కలిగిస్తోందన్నారు. పదవులు ఉండొచ్చు పోవచ్చు... సిద్దిపేట ప్రజలకు నిత్యం జవాబుదారులుగా నిలువాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆనాడు సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి విజయగాథలు రాసిన జర్నలిస్టులు ప్రస్తుతం అభివృద్ధి వెనుక పాటుపై ఆలోచించాలని కోరారు. జర్నలిస్టులకు తాను సమయాల్లో అండగా ఉంటానని తెలిపారు. కరోనా సమయంలో జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కరోనా సమయంలో తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అనేక మంది జర్నలిస్టులను కరోనా నుండి కాపాడినట్లు తెలిపారు. జర్నలిస్టులు తమకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని దిగమింగుకుని ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తారని చెప్పారు. జర్నలిస్టుల జీవితం బయటకు కనబడినంత సుఖమయం కాదని, వారికి చాలా కష్టాలు ఉంటాయని చెప్పారు.  ఉమ్మడి మెదక్ జిల్లాలో జర్నలిస్టులకు  అన్ని విధాల సహాయం చేసామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేటకు చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూడడానికి వచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో సిద్ధిపేటను దేశానికి ఆదర్శంగా నిలిపినట్లు చెప్పారు. సిద్ధిపేటకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తమకు సిద్దిపేట ప్రగతికి ప్రయోగ శాల మెచ్చుకోవడమే కాక, ఇక్కడి అభివృద్ధి నుంచి పాఠం నేర్చుకున్నామని పేర్కొన్నారని గుర్తు చేశారు. దేశంలోని చాలా మందితో పాటు, విదేశీయులు ఇబ్రహింపూర్ గ్రామాన్ని సందర్శించారని తెలిపారు. మన దేశంలో ఉండే బ్రిటిష్  అంబాసిడర్‌ సిద్ధిపేటను సందర్శించి చెత్త ద్వారా కంపోస్టు ఎరువు తయారి విధానాన్ని చూశారని తెలిపారు. "ఎంతో మంది సిద్దిపేట భేష్...!! అన్నారు. ఆయిల్ ఫామ్ గురించి తెలియని వారికి అ పంటను పరిచయం చేసి అత్యదికంగా దిగుబడి వచ్చేలా చేశాం. నాడు విజయ గాధల సిద్దిపేటపై జర్నలిస్టులు ఎంతో అద్భుత కథనాలు రాశారు. అలాంటి సిద్ధిపేటలో  అభివృద్ధి పనులు ఆగిపోయి వెక్కిరించే విధంగా మారింది" ఆని అవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటకు మంజూరు అయిన వెటర్నరీ కళాశాలను కొడంగల్ తరలించారు. సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కొరకు నిర్మించిన వెయ్యి పడకల ఆసుపత్రి పనులు అర్థాంతరంగా నిలిపివేశారు. చిన్నకోడూరు నాలుగు లైన్ల రోడ్ మద్యలో అగిపోయాయి. రెండు సంవత్సరాలలో ఔటర్ రింగ్ రోడ్డులో ఉండే గుంతలను కూడా పూడ్చలేదు. శిల్పా రామం శిలాఫలకానికే పరిమితం అయింది" అని ఆవేదన చెందారు. "అనాడు విజయాలను వార్తలుగా రాశారు. ఇప్పుడు సిద్దిపేట అభివృద్ధి కష్టాలపై కూడా సిద్దిపేట జర్నలిస్టులు బాధ్యతగా ఆలోచించండి"అని కోరారు. సిద్దిపేట అభివృద్ధికి రెండు సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయలేదని చెప్పారు. కొత్త అభివృద్ధి పని ఒక్కటీ జరగకపోగా పాత వాటిని ఆపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు,జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు కె రంగాచారి నాయకులు కూతురు రాజిరెడ్డి, అరుణ కుమార్, కత్తుల శ్రీనివాస్ రెడ్డి, నాయిని సంజీవరెడ్డి,  రంగధాంపల్లి శ్రీనివాస్ గౌడ్, పాండు, బబ్బురి రాజు,  కాసర్ల మురళి, పోతరాజు రమేష్,  అయిత శ్రీనివాస్, మజ్జూ,  రఘు, ఇంద్ర, సాయి, సిద్దిపేట నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.