Latest News
డంపింగ్ యార్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ను తీసివేయాలి
08 Sep, 2025
42 Views
డంపింగ్ యార్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ను తీసివేయాలి
సిద్దిపేట అర్బన్,సెప్టెంబర్ 08(అవని విలేకరి)బుస్సాపూర్ శివారులోని డంప్యార్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ను తీసివేయాలని బుస్సాపూర్,వరదరాజు పల్లి గ్రామస్తులు నిరసన తెలియజేశారు.సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ శివారులోని మున్సిపల్ డంప్ యార్డ్ తో పాటు బయోగ్యాస్ ప్లాంటును కూడా తీసివేయాలని సోమవారం డంప్ యార్డ్ ముందు ధర్నా చేశారు.ఈ సందర్భంగా రైతులు ప్రజలు మాట్లాడుతూ బయో గ్యాస్ ప్లాంట్ నుండి వచ్చే కలుషిత నీరు ద్వారా పక్కనే ఉన్న చెరువులోని నీటిలో కలిసి చేపలు చనిపోయాయని, డంపు యార్డ్ నుండి వచ్చే దుర్వాసన వలన అనారోగ్యాలకు గురవుతున్నామని అన్నారు.మున్సిపల్ డంపు యార్డుకు ఆర్డీవో సదానందం తో పాటు అధికారులు వచ్చి పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశానుసారం డంప్యాడ్ కు వచ్చామని ఇక్కడున్న పరిస్థితులను పరిసరాలను పరిశీలించి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని మాకు ఆదేశాలు ఇచ్చారని ఆ విషయమై ఈరోజు రావడం జరిగిందని అన్నారు.ఇక్కడ ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.మంగళవారం లేదా బుధవారం రోజున కలెక్టర్కు కల్పిస్తామని తాసిల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు గ్రామస్తులు ధర్నా విరమించారు.