Latest News

తండ్రి, కొడుకుల మృతి తీవ్రంగా కలిచి వేసింది - హరీష్ రావు

20 Aug, 2025 50 Views
Main Image
తండ్రి, కొడుకుల మృతి తీవ్రంగా కలిచి వేసింది.. 
- అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..  
- విద్యుత్ షాక్ తో మృతి చెందిన తండ్రి కొడుకుల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు 
- కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటానని మనోధైర్యాన్ని ఇచ్చిన హరీష్ రావు 
చిన్నకోడూరు,ఆగస్టు 20(అవనివిలేకరి)ఇంటికి పెద్ద దిక్కు.. ఇపుడు ఇప్పుడే చేతికి వచ్చిన కొడుకు ఒకే సారి మృతి చెందడం దురదృష్ట కరమని తనను ఎంతో ఆవేదన, మనసు ని కలిచి వేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు  అన్నారు.. చిన్నకోడూరు మండలం చంద్లపూర్ గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి లు విద్యుత్ షాక్ తో మృతి చెందగా వారి కుటుంబాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం పరామర్శించారు.  బోరున ఏడుస్తు..  శోక సంద్రం లో ఉన్న కుటుంబాన్ని ఓదార్చి మనోధైర్యాన్ని ఇచ్చారు. అధైర్య పడొద్దని అండగా ఉంటానని భరోసానిచ్చారు.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలియజేసారు