Latest News

ఉపాధ్యాయ వృత్తిని వదిలి, దోపిడిపై దండెత్తి, విప్లవాల బాటనడిచిన నక్సలైట్ నాయకులు రాంచంద్రారెడ్డి

23 Sep, 2025 151 Views
Main Image
సిద్దిపేట,సెప్టెంబర్ 23(అవనివిలేకరి)ఉన్నత విద్యను వదిలి,ఉపాధ్యాయ వృత్తిని వదిలి, మావోయిస్టుపార్టీలో ఉన్నత శిఖరాలకెదిగి, దోపిడీపై దండెత్తి, విప్లవాల బాట నడిచి, బాట కొరకు నిండు బ్రతుకు బలిచేసిన  మావోయిస్టు,నక్సలైట్ నాయకుడు,కేంద్రకమిటి సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి  40 యేండ్ల పోరాట ప్రస్థానం ముగిసింది. పోరాటాలకు నిలయమైన హుస్నాబాద్ నియోజకవర్గంలోని పాత కరీంనగర్ జిల్లా కొహెడ మండలం తీగలకుంట గ్రామానికి చెందిన కట్టా రాంచెంద్రారెడ్డి అబూజ్మాడ్ ఎన్కౌంటర్లో మృతిచెందారు.కరీంనగర్, భూపాల్ పల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1985 నుండి అప్పటి పీపుల్స్ వార్ సానుభూతిపరునిగా ఉన్నటువంటి రాంచెంద్రారెడ్డి 1989 లో ఉపాధ్యాయ వృత్తిని వదిలి పూర్తి స్థాయి పీపుల్స్ వార్ లోకి  వెళ్లారు. ఇతర రాష్ట్రాలలో మావోయిస్టుగా పనిచేసిన రామచంద్రారెడ్డి అంచెలంచెలుగా కేంద్రకమిటి సభ్యులుగా ఎదిగారు.