Latest News

దళిత బాలిక సహస్రిని హత్య దారుణం.

23 Aug, 2025 92 Views
Main Image
దళిత బాలిక సహస్రిని హత్య దారుణం.
దిశ చట్టం లాగా సహస్రిని పేరుతో చట్టం చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తా.
హత్య కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసుగా మార్చాలి.
పోలీసులను ఆదేశించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య
హైదరాబాద్,ఆగస్టు 23(అవనివిలేకరి)నగరంలో పట్టపగలు దళిత బాలిక సహస్రిని హత్య చేయడం అత్యంత దారుణమైన సంఘటన అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి సంగిత్ నగర్ లో హత్యకు గురైన సహస్రిని బాలిక తల్లిదండ్రులు కృష్ణ, రేణుక లను శనివారంనాడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాలికను హత్య పై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాలిక హత్య కేసును ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సెక్షన్ లు చేర్చాలని ఆదేశించారు. కుటుంబాన్ని అదుకునె విధంగా ప్రభుత్వానికి నివెదిస్తామని చెప్పారు.నష్టపరిహారం తో పాటు పక్కా గృహం,ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.సహస్రిని  పేరుతో చట్టం చేయాలి.ఎ బిడ్డ ఇలాంటి దారుణానికి గురి కావద్దురాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య కు విన్నవించిన తల్లిదండ్రులుమా బిడ్డ హత్య కు గురైనట్లు ఎ బిడ్డ ఇలాంటి దారుణానికి గురి కావద్దని కూకట్‌పల్లి లో హత్య కు గురైన దళిత బాలిక సహస్రిని తల్లిదండ్రులు కృష్ణ, రేణుక లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య కు విన్నవించారు. మా బిడ్డ సహస్రిని చట్టం చేయాలని తల్లిదండ్రులు విన్నవించారు.నా కొడుకు ని ఇంట్లో వదిలి  వెళ్ళాలంటే భయం అవుతుందని  సహస్రిని తల్లి రేణుక ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో  దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్ )జాతీయ కార్యదర్శి పి.శంకర్,జాతీయ మాలమహనాడు మెదక్ జిల్లా అధ్యక్షుడు కల్లూరి సంజీవ,ఉల్లుట్ల శివ ,ఆనందరావు,నీరుడి కుమార్,బిఎస్పి రాష్ట్ర నాయకులు మోహన్‌ ,బాబురావు ,కల్లురి చంద్,తదితరులు పాల్గొన్నారు.